మళ్లీ ఊపిరి పోసుకుంటున్న ఏపీ హక్కు.. ఢిల్లీ వేదికగా పోరాటం

by srinivas |   ( Updated:2024-01-31 11:11:20.0  )
మళ్లీ ఊపిరి పోసుకుంటున్న ఏపీ హక్కు.. ఢిల్లీ వేదికగా పోరాటం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హక్కు మళ్లీ ఊపరి పీల్చుకుంటుంది. రాష్ట్ర విభజనతో రావాల్సిన హక్కులు రాక రాష్ట్రంలో మరింత అప్పులపాలైంది. దీంతో మరోసారి ఉద్యమానికి సర్వం సిద్ధమవుతోంది. ఢిల్లీ వేదికగా రాష్ట్ర హక్కుపై గళమెత్తనున్నారు. 2014లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలపై ఎలాంటి అడుగులు పడలేదు. పదేళ్ల పాటు ఎన్ని ఉద్యమాలు చేసిన పట్టించుకోలేదు. దీంతో ఆశలు వదులుకుంటున్న సందర్భంగా ఏపీలో జరిగిన పరిణామాలు మళ్లీ ఆవైపు చూసేలా చేస్తున్నాయి. విభజన పాపంతో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా పాతాళానికే పరితమిమైంది. ఈ పదేళ్లలో కేంద్రంలో బీజేపీ ఉన్నా విభజన హామీలు నెరవేర్చలేకపోయిందనే భావన ప్రజల్లో ఉంది.



అటు పదేళ్లు పాలించిన రాష్ట్ర నేతలు సైతం చేతులెత్తారని ప్రజలు అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ రంగంలోకి దిగింది. కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించి రాష్ట్రంలో కూడా సత్తా చాటాలనుకుంటుంది. అయితే పదేళ్ల క్రితం ఆ పార్టీ ఇచ్చిన హామీలను మళ్లీ తెరపైకి తెచ్చింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో విభజన హామీలే ఆయుధాలుగా మారి అధికార, ప్రతిపక్షాలపై పోరాటానికి ఊపిరినిచ్చాయి. అంతేకాదు ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చింది. దీంతో విభజన హామీలపై ఢిల్లీల్లో పోరాటం చేసేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 2న కీలక సమావేశం నిర్వహించి అనంతరం ఢిల్లీ వేదికగా ఆమె దీక్షకు దిగనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రావాల్సిన హక్కులన్నింటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయనున్నారు.ఫిబ్రవరి 1న షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. మరి ఎన్నికల ముందు షర్మిల తీసుకున్న నినాదం ఏ మేరకు పని చేస్తుందో చూడాలి.

Advertisement

Next Story