- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవీకి ఏపీ కాంగ్రెస్ నేతల స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీసీసీ చీప్ గిడుగు రుద్రరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోనియా గాంధీని ‘వ్యూహం’ సినిమాలో చెడుగా చూపిస్తే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు..వైఎస్ జగన్ అరెస్ట్ తదితర అంశాలనే ఇతివృత్తంగా చేసుకుని సినిమా తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ టీజర్‌లో సీబీఐ డౌన్ డౌన్ అంటూ చేసే నినాదాలు సైతం వినిపిస్తున్నాయి, అలాగే చివరలో అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు అంటూ జగన్ పాత్రపోషించిన హీరో అజ్మల్ అమీర్ అన్న వ్యాఖ్యలు సైతం ఉన్నాయి. దీంతో ఈ సినిమాలో చంద్రబాబును విలన్‌గా చూపిస్తున్నారా? లేక సోనియాగాంధీని విలన్‌గా చూపిస్తున్నారా అన్న దానిపై చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ‘వ్యూహం’ సినిమా టీజర్‌పై స్పందించారు. ‘వ్యూహం’ సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపించే ప్రయత్నం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
అసలు వాస్తవాలు వర్మకి తెలుసా? అని గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వైఎస్ షర్మిల తమ నాయకుడి కుమార్తె అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ మహానాయకుడని..రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది ఆయన చివరి కోరిక అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కోరికను నెరవేర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఇందులో వైఎస్ షర్మిల కూడా భాగస్వామ్యం అవ్వాలనుకుంటే తాము స్వాగతిస్తున్నట్లు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. .