AP: జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రోజులు దగ్గరపడ్డాయ్: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్

by Shiva |
AP: జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రోజులు దగ్గరపడ్డాయ్: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రోజులు దగ్గరపడ్డాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల రాక్షస పాలనకు త్వరలోనే అంతం కాబోతోందని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఎక్కడిక వెళ్లినా జనం టీడీపీకి నీరాజనం పలుకుతున్నారని తెలిపారు. అదేవిధంగా పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరికి ఓటేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో చెరువు, భూములు ఆక్రమణకు గురయ్యాయని, తాము అధికారంలోకి రాగానే వాటన్నింటి తిరిగి ప్రజలకు చెందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రాజమండ్రి నియోజకవర్గంలో తనకు ఎదురే లేదని, వార్ వన్‌సైడేనని అన్నారు. అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని సాగనంపడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి లేకపోయినా.. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని, అన్ని విషయాలను ఓ కరపత్రం రూపంలో ముద్రించి ప్రజలకు పంచి పెడుతున్నానని అన్నారు. పోయిన ఎన్నికల్లో జగన్ కోడికత్తి పేరుతో నాటకం ఆడాడని, ఈ ఎన్నికల్లో గులకరాళ్ల డ్రామా ఆడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా.. రాష్ట్రంలో రాబోయేది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమియేనని ధీమా వ్యక్తం చేశారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story