- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP: సస్పెండైన వాలంటీర్లు వైసీపీకి పని చేస్తున్నారు: జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ నిర్వహణలో వివిధ కారణాల చేత సస్పెండైన వాలంటీర్లు అందరూ నేరుగా వైసీపీకి పని చేస్తున్నారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇవాళ వాలంటీర్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు లిబరేషన్ కాంగ్రెస్ నేతతో కలిసి విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారుజ. సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని ఈసీని కోరినట్లుగా ఆయన తెలిపారు. చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు పెట్టాలని, వాలంటీర్లు, మెప్మా సిబ్బందిని బదిలీ చేయాలని కోరామని వెల్లడించారు. ఇక నుంచి అయిన మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు. వాలంటీర్లు స్థానికంగా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవంటూ జేడీ లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.