Alert: ఏపీ విద్యార్థులకు జూన్ రెండు వరకే ఆ అవకాశం.. తెలంగాణ విద్యాశాఖ..

by Indraja |   ( Updated:2024-04-25 03:29:15.0  )
Alert: ఏపీ విద్యార్థులకు జూన్ రెండు వరకే ఆ అవకాశం.. తెలంగాణ విద్యాశాఖ..
X

దిశ వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే నేటికీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణలోని విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వీలుగా ప్రవేశాలను కల్పిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది.

కాగా ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు జూన్ 2వ తేదీతో ముగుస్తుంది అని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. అలానే గడువు లోపల తెలంగాణాలో జరిగే ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. జూన్ 2వ తేదీ తరువాత పరీక్షలు రాసే ఆంధ్ర విద్యార్థులకు రిజర్వేషన్స్ ఉండవని పేర్కొంది. కాగా జూన్ 2వ తేదీ తరువాత తెలంగాణ విద్యార్థులకే స్థానికత వర్తిస్తుందని, వారికే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story