AP Skill Development Scam Case: నలుగురు నిందితుల అరెస్ట్

by srinivas |   ( Updated:2023-03-10 12:03:39.0  )
AP Skill Development Scam Case: నలుగురు నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నిందితులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీమెన్స్ కంపెనీ మాజీ డైరెక్టర్ శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్‌తో పాటు పీవీఎస్పీ ఐటీ స్టిల్స్ సీఈవో ముకుల్ చంద్ర, ఎస్ఏఆర్ఏ సీఏ సురేశ్ గోయల్‌ను అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దూకుడు పెంచారు. కీలక నిందితులను అరెస్ట్ చేశారు.

ఇప్పటికే సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్‌ అరెస్ట్

కాగా ఇదే కేసులో సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్‌ను సీఐడీ పోలీసులు గురువారం నోయిడాలో అరెస్ట్ చేశారు. సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందన్న కోణంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయనను నోయిడా నుంచి విజయవాడ తీసుకొచ్చారు. అనంతరం భాస్కర్‌కు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

గత ప్రభుత్వ హయాంలో స్కాం

కాగా గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌లో రూ. 241 కోట్ల స్కాం జరిగిందని సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.అయితే ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించారని దర్యాప్తులో వెల్లడైనట్లు సీఐడీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed