- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ పాలిసెట్-2023 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణితో కలిసి శనివారం ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ ఫలితాల్లో 86.35శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ ఫలితాల్లో కూడా బాలికలే పై చేయి సాధించారు. బాలికలు 88.90శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 84.74శాతం ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చాయి.
ఈ ఏడాది మే 10న పాలిసెట్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్‌లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.