- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక తుది నిర్ణయం తీసుకుంటాం.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యమం చేస్తున్నాం కాబట్టే మళ్ళీ ఏసీబీ దాడులు మొదలయ్యాయని వైసీపీ ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 84 రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉద్యమం అంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదే అని బొప్పరాజు అన్నారు. కార్యాలయంలో కాగితాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ఏసీబీతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఏసీబీ దాడుల ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఉద్యోగులకూ చట్టబద్ధంగా రావాల్సిన మొత్తాలు ఇవ్వరని, పెన్షనర్‌లకూ పింఛన్ ఇవ్వడం లేదని విమర్శలు చేశారు.
మరో ప్రత్యామ్నాయం లేదు..
ఈ ఉద్యమం ఆగాలంటే ఉద్యోగులు ఇచ్చిన 50 డిమాండ్‌లను పరిష్కరించడం తప్పా ప్రభుత్వానికి మరో మార్గం లేదన్నారు. ఉద్యమం తీవ్రతరం అయితే దాని బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి వినిపించేది ప్రభుత్వ వాదనే అని.. గతంలో ఆయనే ఈ విషయాన్ని ప్రకటించినట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ, ఏరియర్‌లు, డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అవసరం లేదా అన్న విషయం వెంకటరామిరెడ్డి తేల్చి చెప్పాలన్నారు. ఆయన మాట్లాడిన విషయాలు అన్ని ప్రభుత్వం మాట్లాడినట్టుగానే భావిస్తున్నామని.. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమే అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.
Also Read..
డిగ్రీ తప్పిన స్పీకర్ ఎల్ఎల్‌బీ ఎలా చదివారు?: టీడీపీ నేత ధూళిపాళ్ల