AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

by samatah |   ( Updated:2022-06-22 07:40:42.0  )
AP Inter Results Released
X

దిశ, వెబ్‌డెస్క్ : AP Inter Results Released| ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్ ఫలితాలను ఒకేసారి మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 2, 58,499 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి. మొదటి సంవత్సరంలో బాలురు 49 శాతం‌తో పాస్ అవగా, బాలికలు 60 శాతంతో పాస్ అయ్యారు. ఇక రెండో సంవత్సరంలో బాలురు 54 శాతంతో పాస్ అవ్వగా, బాలికలు 68 శాతంతో పాస్ అయ్యారు.ఒకేషనల్‌ ఫస్టియర్లో 40శాతం, సెకండ్ ఇయర్ 55శాతం మంది పాస్ అయ్యారు. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 75శాతం మంది పాస్ కాగా, కడప జిల్లాలో 50 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 25 నుంచి జులై 5 వరకు వెసులుబాటు ఉంటుంది. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు ప్రతి రోజు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు.

ఇక ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4లక్షల 45 వేలమంది హాజరు కాగా, సెకండియర్ పరీక్షలకు 4లక్షల 23వేల455 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఏపీ ఇంటర్ మీడియెట్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయినా https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in వెబ్ సైట్ల ద్వారా చూసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed