AP Home Minister: వైసీపీ ట్వీట్‌కు ఏపీ హోం మంత్రి స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏ అంశం మీద తెలుసా..?

by Aamani |
AP Home Minister: వైసీపీ ట్వీట్‌కు ఏపీ హోం మంత్రి స్ట్రాంగ్  కౌంటర్.. అసలు ఏ అంశం మీద తెలుసా..?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉండిపోయిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో డ్రగ్స్, ఇసుక తవ్వకాలు, ర్యాగింగ్ పై సమస్యలపై ఇప్పటికే దూకుడు గా వ్యవహరిస్తున్నారు. గురువారం వైసీపీ ట్వీట్ కు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత స్పందించారు. సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'గత YCP ప్రభుత్వంలో ఫిబ్రవరి 2024 న జరిగిన ఈ ర్యాగింగ్ పై ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం వల్ల బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన దాడులను మాకు అంట కట్టడం వైసీపీ మానుకుంటే మంచిది. పట్టాలు తప్పిన లా అండ్ ఆర్డర్ ను ఇప్పుడిప్పుడే గాడిలోకి తెస్తున్నాం. ఎవరు తప్పు చేసినా వదలం' అని మంత్రి తెలిపారు.దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed