- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ(Village), వార్డు సచివాయాల ఉద్యోగుల(Ward Secretariat Employees)ను కుదించింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించింది. ఈ మేరకు మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేనల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులను విభజించింది. స్వర్ణాంధ్ర విజన్-2047(Swarnandhra Vision-2047)లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు సచివాలయాలను కేటగిరీలుగా విభజన చేపట్టింది. జనాభా ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించింది . రెండున్నర వేల లోపు జనాభా ఉన్న సచివాలయాన్ని ‘A’ కేటగిరిగా విభజించడమే కాకుండా ఉద్యోగులను ఆరుకు పరిమితం చేసింది. మూడున్నర వేలలోపు జనాభా ఉన్న సచివాలయల్లో ఉద్యోగులను ఏడుకు కుదించింది. మూడున్నరకు పైబడి జనాభా ఉన్న సచివాలయాల్లో ఉద్యోగులను 8గా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కుదించడంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.