- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు
దిశ, వెబ్ డెస్క్: రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను 48 గంటల్లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమం, పౌరసరఫరాలపై కలెక్టర్లతో చంద్రబాబు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ గత సర్కార్ విధానాలను పక్కన పెట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు అనుకూలంగా పని చేయాలని, ఆ మేరకు కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
సివిల్ సప్లైకు సంబంధించి 2014-19 అనుసరించిన విధానాన్నే ప్రస్తుతమూ అమలు చేయాలన్నారు. రేషన్ కార్డుదారులకు మిల్లెట్లు అందజేయాలని సూచించారు. చేనేతలకు ఆధునిక యంత్రాలు అందజేసి అండగా నిలవాలన్నారు. మద్యం షాపులను గౌడ కుటుంబాలకు రిజర్వ్ చేయాలని సూచించారు. కొన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాయని చెప్పారు. వారందరికి సామాజిక న్యాయం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.