డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ డీజీపీ తిరుమలరావు

by Mahesh |
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ డీజీపీ తిరుమలరావు
X

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం పర్యటనలో భాగంగా.. రాష్ట్రంలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు తప్పుతున్నాయని.. కఠినంగా వ్యవహరించాలని, దీనికి హోంమంత్రి బాధ్యత తీసుకోవాలి, నేరస్తులకు కులం, మతం ఉండదని అందరిని కఠినంగా శిక్షించాలని, తాను హోంమంత్రి పదవి తీసుకుంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని.. అత్యాచార నిందితులకు యూపీ తరహా శిక్ష విధించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై హోంమత్రి అనిత కూడా స్పందించారు. తాను డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను పాజిటీవ్ గా తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

అలాగే మంగళవారం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా స్పందించారు. తాను మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సెపరేట్ గా కామెంట్ చేయనని.. శాంతి భద్రతల కోసం రాష్ట్రంలో దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే తమ విధానమని, తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో తాము పని చేయమని అన్నారు. ఐజీ సంజయ్‌పై విచారణ జరుగుతోందని...దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసును అయినా విచారిస్తామని స్పష్టం చేశారు. ఎవరికి ఎంత ప్రొటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలని డీజీపీ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed