- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు(Delhi Election Results) పూర్తిగా విడుదల అయ్యాయి. దేశ రాజధానిలో 70 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. మొత్తం 48 స్థానాల్లో బీజేపీ(Bjp) గెలిచింది. అధికార ఆప్(AAp)కు ఢిల్లీ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. 22 స్థానాలకే పరిమితం చేశారు. దీంతో ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్‌పై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ(Ap) అధికార పార్టీ నేతలు కూడా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సహా పలువురు టీడీపీ(Tdp), జనసేన(Janasean), బీజేపీ(Bjp) నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మోదీ నాయకత్వాన్ని ఢిల్లీ ప్రజలు విశ్వసించారని, అందుకే దేశ రాజధానిలో బీజేపీని బలపర్చారని తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా ఉందని, దీంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. సందను పెంచాలని, అప్పుడే మౌలిక వసతులు మెరుగవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో రాజకీయ కాలుష్యం కూడా బాగా పెరిగిపోయిందన్నారు. మోదీపై నమ్మకంతో బీజేపీని గెలిపించారన్నారు. దేశ రాజధానిలో ఎన్డీఏ చారిత్రకవిజయం సాధించిందని చెప్పారు. స్థిరమైన పాలన, నాయకత్వంతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశానికి సరైన సమయంలోనే సరైన నాయకుడు మోడీ వచ్చారని, అందుకే ఢిల్లీ ప్రజలు బీజేపీని బలపర్చారని చంద్రబాబు పేర్కొన్నారు.