- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP Govt: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు భారీ గుడ్ న్యూస్!?

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన రేపు(శుక్రవారం) కేబినెట్ భేటీ(Cabinet Meeting) జరగనుంది. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) పథకం పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla project) పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరుపనున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా హామీలు(Farmer Assurance Guarantees), పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10 శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, పాలనా పరమైన అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) చర్చించనున్నారు.