- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP: ఏపీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక చలాన్లు బాదుడే!

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వాహనదారులు రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించడం లేదంటూ ఇటీవలే ఏపీ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ (New Motor Vehicle Act)ను అమలు చేయబోతోంది. ఇకపై వాహనదారులు రూల్స్ పాటించని పక్షంలో భారీ జరిమానాలు, జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు హెల్మెట్ (Helmet), సీట్లు బెల్టు (Seat Belt) పెట్టుకోవాలని విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా వారికి వెసులుబాటు కోసం కొంత టైమ్ కూడా ఇచ్చారు. ఇకపై ఎవరైనా హెల్మెట్ (Helmet) లేకుండా బైక్ నడిపితే రూ.వెయ్యి జరిమానా విధించానున్నారు.
అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ.వెయ్యి, డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive)లో ఫుల్లుగా తాగి అడ్డంగా దొరికతే రూ.10 వేల జరిమానాతో పాటు లైసెన్స్‌ను కూడా రద్దు చేయనున్నారు. ఇక హైవేలపై ఓవర్ స్పీడ్ (Over Speed), సిగ్నల్ జంప్ (Signal Jump), రాంగ్ రూట్ (Wring Way) డ్రైవింగ్ లాంటి కేసులలో గరిష్టంగా రూ.1000 వరకూ ఫైన్ విధించనున్నారు. ఇక, డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) లేకుండా వాహనాలు నడిపితే రూ.5 వేలు జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) అతీక్రమించిన వాహనదారులకు నేరుగా ఇంటికే చలాన్ కాపీని పంపించనున్నారు. కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన వేళ వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులు కోరుతున్నారు.