Breaking: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

by srinivas |
Breaking: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏపీ అసెంబ్లీ ఉభయ సభలు ఆరు రోజుల పాటు సాగాయి. 27 గంటల 28 నిమిషాల పాటు సభ జరిగింది. మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మూడు శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు. శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలకు సంబంధించి గత ఐదేళ్లలో జరిగిన నష్టాలపై శ్వేత పత్రాలను చంద్రబాబు విడుదల చేశారు. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మిగిలిన సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ 11 స్థానాలకే పరిమితం కావడంతో అసెంబ్లీ సమావేశాల్లో సాధారణ ఎమ్మెల్యేలాగే జగన్ తొలి రోజు హాజరయ్యారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.



Next Story