AP Assembly: నాలుగో రోజు బడ్జెట్ సమావేశాలు.. ఆ అంశాలపైనే కీలక చర్చ!

by Shiva |
AP Assembly: నాలుగో రోజు బడ్జెట్ సమావేశాలు.. ఆ అంశాలపైనే కీలక చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు బడ్జెట్ సమావేశాలు (Budget ఛeetings) ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) పశ్నోత్తరాలతో సభను మొదలు పెట్టనున్నారు. ఇవాళ్టి సమావేశంలో భాగంగా అర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) సభలో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. శాఖల వారీగా కేటాయించిన నిధులపై చర్చ జరగనుంది. అదేవిధంగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల (White Rations Cards) జారీ, భూ వివాద అంశాలు (Land Dispute Issues) కశ్వన్ అవర్‌ (Question Hour)లో సభ ముందుకు రానున్నాయి.

అదేవిధంగా కూటమి సర్కార్ కొత్తగా ప్రవేశ పెట్టిన ఎక్సైజ్ పాలసీ (Excise Policy)పై సభ్యులు మంత్రికి ప్రశ్నలు సంధించనున్నారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడ మెడిసిన్ చదువుతోన్న విద్యార్థుల సమస్యలపై స్వల్ప చర్చ జరగనుంది. ఈ అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) మాట్లాడనున్నారు. మరోవైపు 10 గంటలకు శాసన మండలి సమావేశాలు (Legislative Council Meetings) ప్రారంభమవుతాయి. ఉభయ సభలు (Both Houses) ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభం కానున్నాయి.

Next Story

Most Viewed