- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్న క్యాంటీన్లకు మేం వ్యతిరేకం కాదు.. వాటిని టీడీపీ ఆఫీసులుగా మార్చారు: అంబటి రాంబాబు
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తి అయ్యాయి. రేపు సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పంధించారు. అన్న క్యాంటీన్లకు వైసీపీ పార్టీ నాయకులు వ్యతిరేకం కాదని, పేదలను ఆదుకునే పథకాలు అన్ని కొనసాగాలని అన్నారు. గతంలో అన్న క్యాంటీన్ల పేరుతో అవినీతి జరిగిందిని గుర్తు చేశారు. అలాగే ఈ అన్న క్యాంటీన్లు రద్దీ ప్రాంతాల్లో ఉండాలి.. కొత్తగా నిర్మించిన వాటిలో దాదాపు 114 క్యాంటీన్లు ఊరికి దూరంగా ఉన్నాయని తెలిపారు. వీటి నిర్మాణంలో అంచనాలు పెంచి.. రూ.31 కోట్లను టీడీపీ నేతలు దారి మళ్లించారని, దీనిపై పూర్తి అధ్యయనం చేశాకే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్లకు పచ్చ రంగులు వేసి.. టీడీపీ ఆఫీసులుగా మార్చారని.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రంగుల గురించి పెద్ద రచ్చ చేసిన వారు.. అన్న క్యాంటీన్లకు పసుపురంగు ఎలా వేస్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.