అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పసిపాప గుర్తింపు

by srinivas |   ( Updated:2024-07-28 07:58:48.0  )
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పసిపాప గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారిని పోలీసులు గుర్తించారు. దీంతో పాపను ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. పాప ఆరోగ్యంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం నాగులూరుకు చెందిన గర్భిణి అమృతకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చించారు. ఈ నెల 22న పడ్డంటి పాపకు ఆమె జన్మినిచ్చారు. అయితే రాత్రి సమయంలో ఆస్పత్రిలో ఉన్న పసిపాపను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గాలించారు. స్థానిక సీసీ పుటేజ్ ఆధారంగా చిన్నారిని అనంతపురం శివారులో గుర్తించారు. అయితే కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పసిపాపను మహిళకు కన్న తండ్రి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Next Story