- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రిలో ఆలూరు రంగనాథస్వామి రథోత్సవం జరుగుతోంది. ఈ రథోత్సవానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లేందుకు యత్నించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద సైతం భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఓ పోలీసును జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి నెట్టివేశారు. పోలీసులు తనను రథోత్సవానికి వెళ్లనివ్వకపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇవే పరిస్థితులు పోలీసుల కొడుకులు, కూతుళ్లకు పడతాయని శాపనార్దాలు పెట్టారు. అటు జేసీ దివాకర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే రంగనాథస్వామి రథోత్సవానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ, వైసీపీ వర్గాలు ఎదురుపడితే గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.