Big Breaking: సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

by srinivas |   ( Updated:2023-04-26 10:26:34.0  )
Big Breaking: సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం నార్పల నుంచి పుట్టపర్తికి సీఎం జగన్ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన రోడ్డు మార్గాన పుట్టపర్తికి వెళ్లారు. నార్పలలో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత హెలికాప్టర్‌ మొరాయించింది.

గతంలోనూ ఇలానే..

గతంలో సైతం సీఎం జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ఆ రోజు సీఎం జగన్ గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. గన్నవరంలో టేకాఫ్ అయిన హెలికాప్టర్‌లో పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే గన్నవరంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

తల్లుల ఖాతాల్లోకి రూ.912 కోట్ల జమ

కాగా నార్పలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాసిన సీఎం జగన్.. 8 లక్షల మంది తల్లుల ఖాతాల్లో దాదాపు రూ.912 కోట్లను నేరు జమ చేస్తున్నామన్నారు. చదువు కుటుంబ చరిత్రనే కాదని.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుందన్నారు. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పు చేయకుడదన్నదే తమ ధ్యేయమని చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన చదువు కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు అందిస్తున్నామన్నారు.

గత, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలి

గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు సీఎం జగన్ సూచించారు. పేద పిల్లలు పేదలుగానే మిగిలిపోవాలని గతంలోని పెత్తందారి ప్రభుత్వం భావించిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో డ్రాప్ అవుట్లు తగ్గాయన్నారు.

చంద్రబాబుపై సెటైర్లు

చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. వెన్నుపోటు దారులను, మాయమాటలు చెప్పేవారిని నమ్మెుద్దన్నారు. పులి కథ చెబుతూ బాబుపై సెటైర్లు వేశారు. జాతీయ మీడియాకు ఒక ముసలాయన ఇంటర్వూ ఇచ్చారని, అది చూస్తే తనకు పంచతంత్రం కథలు గుర్తొచ్చాయన్నారు. రాబోయే కురుక్షేత్రంలో తనకు దీవెనలు కావాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story