- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Social Media War: రాప్తాడులో ఉద్రిక్తత (Video)
దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా పరిటాల అభిమాని, టీడీపీ కార్యకర్త అజయ్ సజ్జ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనుచరుడు, వైసీపీ కార్యకర్త హరికృష్ణారెడ్డి మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. రాప్తాడు అభివృద్ధిపై సవాళ్లు ప్రతిసవాళ్లు విరుసుకుంటున్నారు. అంతేకాదు పరిటాల, తోపుదుర్తి, వైఎస్ఆర్ ఫ్యామిలీలపై ఎవరికి వాళ్లు గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను విమర్శించుకుంటున్నారు. ఇది కాస్త ముదిరి వీడియోలు పోస్ట్ చేసుకునే వరకు వెళ్లింది.ఇంకేముందు సోషల్ మీడియాలో మొదలైన వార్ రోడ్డు మీదకు వచ్చింది. దమ్ముంటే రాప్తాడులో మాట్లాడాలని వైసీపీ కార్యకర్త హరికృష్ణారెడ్డికి అజయ్ సజ్జ సవాల్ చేశారు. దీన్ని వైసీపీ నాయకులు సీరియస్‌గా తీసుకోవడంతో రాప్తాడు రచ్చ రచ్చగా మారింది. క్లాక్ టవర్ వద్దకు టీడీపీ, వైసీపీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అక్కడ నుంచి చెదరగొట్టారు.