- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాడుకుని వదిలేస్తోంది’.. ఇండియా కూటమిపై ప్రధాని మోడీ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోడీ మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీ-జనసేన-బీజేపీ చిలకలూరిపేటలో ఇవాళ ప్రజాగళం పేరుతో భారీ బహిరంగా సభ నిర్వహించాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ఒకరంటే ఒకరికి పడదని.. ఎన్నికలకు ముందే ఆ కూటమిలో విభేదాలు బయపపడ్డాయని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి తయారు అయ్యిందన్నారు. అలాంటి కూటమిలో ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచించండని మోడీ ప్రజలకు సూచించారు. మేం ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం విపక్షాలను వాడుకుని వదిలేస్తోందని విమర్శించారు. జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని చెప్పారు.