- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడి దయతో ఎక్కడా కరువు లేదు: CM Jagan
దిశ, శ్రీసత్యసాయి ప్రతినిధి: తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీడీపీ హయాం ఐదేళ్లలో రాష్ట్రమంతా కరవు పరిస్థితులు ఉన్నాయన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎలాంటి సాయం అందించలేదని చెప్పారు. కరవు రావడం, రాకపోవడం ఎవరి చేతుల్లో ఉండదని, ఆదుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు వైఎస్సార్ భరోసా ఇస్తున్నామని చెప్పారు. అంతేకాదు పంట పెట్టుబడి కూడా అందిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 53 లక్షల మంది రైతులకు ప్రతి ఏడాది రూ.13500 ఇస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. రైతులు పగటి పూట 9 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత తమదేనన్నారు. పంటలకు బీమా చెల్లిస్తూ రైతులకు అండగా ఉంటున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.