Tragedy: ఆడుకుంటున్న బాలుడు సంపులో పడి మృతి

by srinivas |
Tragedy: ఆడుకుంటున్న బాలుడు సంపులో పడి మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా మిస్ అయ్యాడు. తల్లిదండ్రులు అంతా వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులు, ఇటు కుటుంబ సభ్యులు గాలిస్తుండగా చిన్నారి ఓ సంపులో విగత జీవిగా కనిపించారు. దీంతో తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం చంద్రబాబు కాలనీలో జరిగింది.

స్థానిక చంద్రబాబుకాలనీలో మంజునాథ్, సరిత దంపతులు నివశిస్తున్నారు. వీరికి కుమారుడు జస్వంత్ జన్మించారు. మంజునాథ్ టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం నుంచి జస్వంత్ కనిపించకుండా పోయారు. దీంతో తండ్రి మంజునాథ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే గురువారం ఉదయం కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఇంటి సంపులో శవమై కనిపించారు. ఈ విషయాన్ని మంజునాథ్ దంపతులకు ఇంటి యజమాని తెలియజేశారు. దీంతొ బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story