- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి ఒక్క రాజధాని అయినా ఉందా.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి ఒక్క రాజధాని అయినా ఉందా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అనంతపురంలో కాంగ్రెస్ న్యాయ సాధన సభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రజలను సీఎం జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆమె ఆరోపించారు. జగన్ పాలనలో వ్యవసాయం అధ్వాన్నంగా మారిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అప్పులేని రైతులు లేరని, మద్దతు ధర లేదని షర్మిల విమర్శించారు.
మద్దతు ధరపై సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఎటు పోయిందని ఆమె నిలదీశారు. పంట నష్ట పరిహారం కోసం రూ. 4 వేల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందన్నారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ఒక్కటైనా నెరవేర్చిందా అని నిలదీశారు. ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ప్రజలను టీడీపీ, జనసేన ఓట్లు అడగాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Read More..