Cm Chandrababu: నెమకల్లు ప్రజావేదిక సాక్షిగా చంద్రబాబు మరో గుడ్ న్యూస్

by srinivas |   ( Updated:2024-11-30 10:37:55.0  )
Cm Chandrababu: నెమకల్లు ప్రజావేదిక సాక్షిగా చంద్రబాబు మరో గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: పింఛన్ లబ్ధిదారుల(Pension Beneficiaries) ఇంటికి వెళ్లి స్వయంగా రూ. 4 వేలు అందించిన సీఎం చంద్రబాబునాయుడు (Cm Chandrababu) మరో గుడ్ న్యూస్ తెలిపారు. పింఛన్ అందుకునే విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. గ్రామ సచివాలయం(Village Secretariat) అధికారులు పెన్షన్ పంపిణీ సమయంలో ఇంటి వద్ద లేని లబ్ధిదారులు కొంత వెసులుబాటు కల్పించారు. వివిధ కారణాలతో ఊరి లేని వాళ్లు మూడు నెలల్లో ఎప్పుడైనా పింఛన్ తీసుకునే అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా నేమకల్లు(Anantapur District Nemakallu)లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఇద్దరు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి డబ్బులు అందజేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక(public forum)లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇక నుంచి పింఛన్ దారులు మూడు నెలల్లో ఎప్పుడైనా పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చని తెలిపారు. అధికారులు వచ్చిన సమయంలో ఇంటి వద్ద లేకపోతే లబ్ధిదారులు నేరుగా సచివాలయాల వద్దకు వెళ్లి తీసుకోవచ్చని తెలిపారు. పెన్షన్ తీసుకునే వారిలో కూలీలు, కార్మికులు ఉండటంతో ఈ వెసులుబాటు కల్పిస్తు్న్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అసలు పింఛన్ పథకాన్ని మొట్టమొదటి సారి తీసుకొచ్చింది నందమూరి తారకరామారావు అని గుర్తు చేశారు. దేశంలోనే రూ.4 వేలు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. పింఛన్ల పంపిణీలో ఒక పైసా కూడా అవినీతి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.

ఇక నుంచి మరింత కష్టపడతామని, అలా సంపద సృష్టించి పేదలకు పంచుతామని చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు అన్ని రకాల సేవలు చేయాలని ఉందని, కానీ సమస్యలు సైతం అంతేస్థాయిలో ఉన్నాయని చెప్పారు. అణగారిని వర్గాలకు ఆదుకుంటామని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తూనే పెన్షన్ డబ్బులు పెంచామన్నారు. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్ డబ్బులు ప్రతి నెలా ఒకటో తారీకునే అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5 నెలల్లో రూ. 18 వేల కోట్లు పెన్షన్ లబ్ధిదారులకు అందజేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

Next Story