- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీకి చిక్కిన CI, కానిస్టేబుల్
దిశ, అనంతపురం: పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ సీఐ ఏసీబీకి పట్టుబడ్డ ఘటన బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రం అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ డి. రాము, కానిస్టేబుల్ కరీంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్‌లో ఒక చీటింగ్ కేసుకు సంబంధించి ఎస్. మల్లికార్జున అనే వ్యక్తిపై క్రైమ్ నెంబర్ :145/2022 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్లికార్జునతో పాటు ఆయన భార్య, తమ్ముడు కూడా నిందితులుగా ఉన్నారన్నారు.
ఈ కేసులో అరెస్టు అయిన మల్లికార్జున బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే మల్లికార్జున భార్య, తమ్ముడు హైకోర్టులో యాంటీసిపేటరీ బెయిల్ తీసుకుని వాళ్లూ వచ్చారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో అక్కడి పోలీస్ స్టేషన్ SHOను సంప్రదించి బెయిల్ తీసుకోవాలని అందులో సూచించారు. ఈ మేరకు ఆయన దగ్గరకు వెళ్లిన సమయంలో అతను తనకు 75 వేల రూపాయలు ఇస్తే బెయిల్ మంజూరు చేస్తానని లేదంటే బెయిల్ పత్రాలు చింపివేసి తన విచారణకు వారు సహకరించలేదని రిపోర్టు ఇస్తానని వారిని ఆయన బెదిరించారు. దీంతో వారు తప్పనిసరి పరిస్థితులలో మొదట్లో 50 వేల రూపాయలు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన సంతృప్తి పడకపోవడంతో పాటు మరో 25 వేల రూపాయలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుపట్టాడ్డారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితులు ఆశ్రయించచడంతో సీఐతోపాటు కరీం అనే మరో కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచారు. అయితే రాము పనిచేసిన ప్రతి చోటా అతనిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
Read More....