- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Political News: వృద్దులు, వికలాంగుల ఉసురుకొట్టి పోతాడు బాబు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపిస్తుంటే.. చంద్రబాబు ప్రజల ఉసురు పోసుకుంటున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వృద్దులకు, వికలాంగులకు అలానే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వాలంటీర్లు ఇంటికి తీసుకు వెళ్లి ఇచ్చేవారు.
అయితే ఎన్నకల కోడ్ అములు లోకి వచ్చిన తరువాత వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచారు. దీనితో వృద్దులు, వికలాంగులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది. అయితే అలా సచివాలయానికి రాలేని వాళ్ళు కూడా ప్రస్తుతం పెన్షన్ కోసం సచివాలయానికి రాకతప్పడం లేదని.. అలా రావడం తమకు చాలా ఇబ్బందిగా ఉందని అంగవైకల్యం కలిగిన ఓ వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఆ వ్యక్తి మాటలను మంత్రి అంబటి రాంబాబు వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అలానే ఆ వీడియోకి వృద్దులు, వికలాంగుల ఉసురుకొట్టి పోతాడు బాబు అనే ట్యాగ్ ను జతచేసారు.
Read More..
రానున్న ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే.. ప్రముఖ సర్వే సంస్ద రిపోర్ట్..!