గ్లాస్ గుర్తుతో..ఊహించని విధంగా పవన్‌కు సపోర్ట్ చేస్తున్న అల్లు అర్జున్!

by Disha Web Desk 18 |
గ్లాస్ గుర్తుతో..ఊహించని విధంగా పవన్‌కు సపోర్ట్ చేస్తున్న అల్లు అర్జున్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సినీ నటులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జనసేనాని కోసం నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, పృథ్వీరాజ్ ప్రచారం నిర్వహించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మరో రెండు మూడు రోజుల్లో పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. తాజాగా సీనియర్ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ కూడా పవన్ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు.

ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ పుష్ప-2 మూవీలో నటిస్తున్నారు. ఇక ఆ (పుష్ప-2) సినిమాలోని ఓ పుష్ప సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాటలో అల్లు అర్జున్ టీ గ్లాస్ పట్టుకుని అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక పాటలో ఐకాన్ స్టార్ గాజు గ్లాస్ తో డాన్స్ చేయడంతో నెటిజన్లు పవన్ కోసమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ కావడం ఎన్నికల వేళ అల్లు అర్జున్ పాట రిలీజ్ కావడం చర్చనీయాంశమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అల్లుఅర్జున్ ఇన్‌డైరెక్ట్‌గా మద్ధతు ఇస్తున్నారని జనసైనికులు అంటున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Read More..

పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. వచ్చేసిన హరిహర వీరమల్లు టీజర్

Next Story

Most Viewed