- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly:‘ప్రకటనల స్కామ్‌పై కమిటీ వేయాలి’ ..అసెంబ్లీలో కూటమి మంత్రుల డిమాండ్
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేటితో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశంలో కూటమి మంత్రులు అసెంబ్లీ వేదికగా గత వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యాడ్స్‌కి సంబంధించి స్కామ్ జరిగిందని..దీనిపై హౌస్ కమిటీ వేయాలని పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. డిజిటల్ మీడియా ద్వారా వందల కోట్లు దోచి పెట్టారు. మీడియాను అడ్డుపెట్టుకుని జగన్ అడ్డగోలుగా వ్యవహరించారని పలువురు మంత్రులు ఫైరయ్యారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. వారికి కావాల్సిన మీడియాకే నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఇచ్చి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఐదేళ్లలో సాక్షి పత్రికకు రూ.403 కోట్లు, . ఈనాడుకు 190 కోట్లు, ఆంధ్రజ్యోతికి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఇచ్చారని శ్రావణ్ కుమార్ అన్నారు. మిగతా పత్రికలన్నింటికీ రూ.488 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చారని అని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇది పెద్ద కుంభకోణం..వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.