- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Air Asia: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. చీప్ అండ్ బెస్ట్ ట్రావెలింగ్.. విశాఖ నుంచి గాల్లో ఎగిరిపోవచ్చు

దిశ,వెబ్‌డెస్క్: Air Asia: ఆకాశంలో తేలియాడే కలలు, తక్కువ ఖర్చుతో నిజమయ్యే ప్రయాణాలు. విమాన ప్రయాణం ఖరీదైనదే అని అనుకునేవారికి ఇప్పుడు ఓ అద్భుతమైన అవకాశం. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఆసియా(Air Asia) విశాఖపట్నం నుండి బ్యాంకాక్(Visakhapatnam to Bangkok), కౌలాలంపూర్‌కు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 5,000రూపాయల లోపు ధరకే అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే సదవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు బుకింగ్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. అయితే ప్రయాణానికి మాత్రం పెద్ద విరామం ఉంది. ఈ సంవత్సరం జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అంటే, మీకు అనుకూలమైన తేదీలను ఎంచుకుని ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటే, అతి తక్కువ ధరకు అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
ఎంత ఖర్చవుతుంది?
సాధారణంగా విశాఖపట్నం నుంచి బ్యాంకాక్(Visakhapatnam to Bangkok), కౌలాలంపూర్‌కి విమాన టికెట్ ధర రూ. 7,500 నుంచి రూ. 12,000 వరకు ఉంటుంది. కానీ తాజా జీరో బేస్ ఫేర్ ఆఫర్ ద్వారా, రూ. 4,400 నుంచి రూ. 5,000 వరకు మాత్రమే ఖర్చవుతుంది. అంటే, ఎప్పుడూ కష్టమైనంతగా అనిపించే అంతర్జాతీయ ప్రయాణం ఇప్పుడు అందరికీ సులభంగా లభించనుంది. కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు, తిరుచిరాపల్లి నుంచి బ్యాంకాక్‌కు కూడా ఇదే తక్కువ ధర ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్ ఆసియా ఈ ఆఫర్ ద్వారా అన్ని వర్గాల ప్రయాణికులకు ప్రయోజనం కలిగించాలనుకుంటోంది.
ఎయిర్ ఆసియా(Air Asia) ఈ ప్రత్యేక తగ్గింపును ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం, ప్రతి వర్గం వ్యక్తికి అంతర్జాతీయ ప్రయాణం సాధ్యమయ్యేలా చేయడం. ఇప్పటివరకు విమాన ప్రయాణాన్ని ఖరీదైనదిగా భావించినవారికి ఇది కొత్త తలుపులు తెరిచే అవకాశం. అంతర్జాతీయ నగరాలను అన్వేషించాలనుకునే టూరిస్టులు, కొత్త అనుభవాలను ఆస్వాదించాలనుకునే ప్రయాణికులు, బిజినెస్ ట్రిప్స్ (Business trips)లేదా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ప్రయాణం చేయాలనుకునేవారు.. అందరికీ ఇది గొప్ప అవకాశం. ఇక జీరో బేస్ ఫేర్ ఆఫర్ అంటే టికెట్ ధర చాలా తక్కువగా లభిస్తుంది. తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రయాణం అనుభవించొచ్చు. ఏకకాలంలో బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి రెండు పెద్ద నగరాలకు ప్రయాణించగలిగే అవకాశం ఇది. ప్రయాణానికి 2026 జూన్ 15 వరకు సమయం ఉంది, కాబట్టి మీకు వీలైనప్పుడే ప్రయాణం చేయొచ్చు.
ఈ ఆఫర్ ఫిబ్రవరి 23లోపు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్ వెళ్లాలని కలలు కనుకుంటే, ఇప్పుడే టిక్కెట్ బుక్ చేసుకోవడం మంచిది. అంతర్జాతీయ ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో అనుభవించే ఈ సువర్ణావకాశాన్ని మిస్ కావొద్దు. గగనాన్ని తాకే మీ కలలు నిజమయ్యే సమయం ఇదే. ఎయిర్ ఆసియా తో మీ డ్రీం ట్రిప్ ప్లాన్ చేసుకోండి తమ్ముళ్లు.