- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అదరహో : పులి డ్యాన్స్‌తో అదరగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్టెప్పులేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో దసరా పులి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఓ ఊరేగింపులో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి తప్పెట్ల మోతకు ఉత్సాహంగా కాలు కదిపారు. కొందరు కళాకారులు పులివేషాలు వేసుకుని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి స్వాగతం పలికారు. డ్యాన్స్ చేస్తూ ఘన స్వాగతం పలికారు. దీంతో ఎమ్మెల్యేను డ్యాన్స్ వేయాలని పలువురు కోరారు. దీంతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూన్ రెడ్డి కూడా హుషారుగా రంగంలోకి దిగారు. తప్పెట్ల మోతకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. పులి స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. పులివేషధారణలో ఉన్న కళాకారులకు ఏమాత్రం తీసిపోని రీతిలో డ్యాన్స్ చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.