- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నలుగురిని తరిమి తరిమి కొట్టండి.. పోసాని సంచలన పిలుపు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పింఛన్‌దారులకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిందని, ఆయనతో చంద్రబాబునే అలా చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయినా సరే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కానీ చంద్రబాబుపై మాత్రం వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా సినీ నటుడు, వైసీపీ నేత పోసారి కృష్ణ మురళి మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబునే కారణమని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేశ్‌తో చంద్రబాబునే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని ఆయన మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని విమర్శించారు. పింఛన్ దారులకు ఇంటి వద్ద నగదు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవి కోసం సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచారని వ్యా్ఖ్యానించారు. రాజకీయ భవిష్యత్ కోసం వంగావీటి రంగాను చంపేశారని, ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను లొంగదీసుకున్నారని పోసాని వ్యాఖ్యానించారు. గతంలో కాపులను చంద్రబాబు రౌడీలతో పోల్చలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా అన్యాయాలు చేశారని, అయినా పవన్ కల్యాణ్‌కు మాత్రం దేవుడు ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తరిమి, తరిమి కొట్టాలని నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పిలుపునిచ్చారు.