చంద్రబాబుకు ఓటు వేయండి: సినీ నటుడు నిఖిల్

by Disha Web Desk 16 |
చంద్రబాబుకు ఓటు వేయండి: సినీ నటుడు నిఖిల్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్డీయే కూటమి తరపున సినీ నటుడు నిఖిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎం.ఎం. కొండయ్య ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కొండయ్యకు నటుడు నిఖిల్ మద్దతు తెలిపారు. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ కూటమికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్బంగా చీరాల గడియారం స్తంభం సెంటర్‌లో నిఖిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమికి ఓటు వేయాలని, చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యను గెలిపించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని నటుడు నిఖిల్ విజ్ఞప్తి చేశారు.

Read More..

ఏపీలో ముగిసిన నామినేషన్ల గడువు.. మొత్తం ఎన్ని దాఖలయ్యాయంటే...!



Next Story

Most Viewed