- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఏపీలో 35 మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 35 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వీరంతా ఏపీ ఎస్ ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి కావలి వెళ్తున్నారు. ఈ సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో 40 బస్సులో ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. క్రేన్ సాయంతో రెండు వాహనాలను పక్కకు తీశారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో రోడ్డుపై వాహనరాకపోకలు యథావిథిగా సాగాయి. అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు వాహనాలను అతివేగంగా నడపొద్దని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బస్సును ఢీకొట్టిన లారీ..నెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును డీ కొట్టిన ఇసుక లారీ.బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు, నలుగురికి గాయాలు కాగా మిగతా ప్రయాణికులకి తప్పిన ప్రమాదం. pic.twitter.com/HcI5Q4vxRq— Telugu Scribe (@TeluguScribe) April 4, ౨౦౨౪