- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడిలో కామాంధులు: మహిళా భక్తులు స్నానం చేస్తుండగా వీడియో తీసి
దిశ, డైనమిక్ బ్యూరో : దేవుడి గుడిలో కూడా మహిళలకు రక్షణ కరువైంది. సాక్షాత్తు దేవుడు కొలువై ఉండే ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు మహిళా భక్తులు తరలివస్తుంటారు అనడంలో సందేహం లేదు. ఇలా దేవాలయాలకు వచ్చే మహిళా భక్తులను సైతం కొందరు కామాంధులు వదలడం లేదు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు అనేక అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా తాత్కాలిక మరుగుదొడ్లలో మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఓ యువకుడు మెుబైల్లో రికార్డ్ చేశాడు. అయితే ఈవిషయాన్ని గమనించిన సదరు మహిళలు గట్టిగా కేకలు వేయగా అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే గురువారం మహిళా భక్తులు ఒంటిమిట్ట ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఉదయం 9.30 గంటలకు తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేసేందుకు వెళ్లారు. మహిళలు తాత్కాలిక మరుగుదొడ్లలోకి వెళ్లడాన్ని గమనించిన ఓ యువకుడు అక్కడికి వెళ్లాడు. మరుగుదొడ్ల వెంటిలేటర్ నుంచి మెుబైల్‌తో మహిళా భక్తులు స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళా భక్తులు గట్టిగా కేకలు వేయడంతో ఆ యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. వెంటనే మహిళా భక్తులు ఈ ఘటనపై భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలించినప్పటికీ ఆ యువకుడి ఆచూకీ తెలియరాలేదు. సీసీ ఫుటేజీ పరిశీలించినప్పటికీ నిందితుడి ఆచూకీ లభించలేదు. ఈ అంశాన్ని మహిళా భక్తులు ఆలయ డిప్యూటీ ఈవో దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్నానపు గదులు, వస్త్రాలు మార్చుకునే గదుల వద్ద గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఈ వో హామీ ఇచ్చారు. తమ వీడియోలను ఏం చేస్తారోనని ఆ మహిళా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.