చంద్రబాబు నుంచి ఓర్పు నేర్చుకున్నాను: భువనేశ్వరి

by Javid Pasha |   ( Updated:2023-10-26 15:04:24.0  )
చంద్రబాబు నుంచి ఓర్పు నేర్చుకున్నాను: భువనేశ్వరి
X

దిశ, వెబ్‌డెస్క్: 'నిజం గెలవాలి' బస్సు యాత్రలో భాగంగా గురువారం తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. భువనేశ్వరి మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్‌కు తమకు 30 నిమిషాలే సమయం ఇస్తారని, ఆ సమయంలో ప్రజల గురించి చంద్రబాబు మాట్లాడతారని తెలిపారు. చంద్రబాబు ప్రజల మనిషి అని, ఐటీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.

అక్రమ కేసులు పెట్టి 48 రోజులుగా జైల్లో పెట్టారని, చంద్రబాబు చాలా ధైర్యవంతుడని భువనేశ్వరి తెలిపారు. దసరా సందర్భంగా ప్రజలకు బాబు బహిరంగ లేఖ రాస్తే దానిపై ప్రభుత్వం విచారణ చేపడుతూ సమయం వృథా చేస్తుందని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను బెదిరించడానికే ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందని ఆరోపించారు. తన తండ్రి ఎన్టీఆర్ నుంచి పౌరుషం, చంద్రబాబు నుంచి ఓర్పు తాను నేర్చుకున్నానని భువనేశ్వరి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed