ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-15 10:59:50.0  )
ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం పై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిన్న(సోమవారం) మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించగా, రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

తాజా నిర్ణయం ప్రకారం.. అదనపు ప్రివిలేజ్‌ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్‌ ఫీజు ఉంటుంది. విదేశీ మద్యం బాటిళ్లపై అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచారు.

Next Story

Most Viewed