- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కర్నూలు జిల్లాలో ఘోరం.. ఇద్దరు స్పాట్ డెడ్

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు(Vorvakallu)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్థానిక బైపాస్ రోడ్డుపై ట్రాక్టర్(Tracktor)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కారు ప్రయాణికులు జానకి, విహారిక అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని అంచనా వేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పట్టించుకోవడంలేదన్నారు. ఇక నుంచైనా రోడ్డు రూల్స్ ఫాలో కావాలని సూచించారు. తాగి డ్రైవింగ్ చేయొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.