YSRCP:వైసీపీకి ఊరట..ఆయనకు విపక్ష నేత హోదా!?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-22 09:44:48.0  )
YSRCP:వైసీపీకి ఊరట..ఆయనకు విపక్ష నేత హోదా!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్థితుల్లో అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్ తీవ్రంగా పట్టుబడుతున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ కూడా రాయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వైసీపీకి విపక్ష నేత హోదా ఇచ్చేలా లేదు. అయితే శాసన మండలిలో మాత్రం మెజార్టీకి మించి ఎమ్మెల్సీల బలం ఉన్న వైసీపీకి విపక్ష నేత హోదా దక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని శాసన మండలిలో విపక్ష నేతగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story