అమరావతి జేఏసీ కీలక నిర్ణయం.. రాజధాని విషయంలో తెరపైకి కొత్త డిమాండ్

by srinivas |
అమరావతి జేఏసీ కీలక నిర్ణయం.. రాజధాని విషయంలో తెరపైకి కొత్త డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాజధాని విషయంలో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అమరావతి జేఏసీ అంటోంది. ఈ మేరకు సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై విషం చిమ్మిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టింది. రాజధాని భవనాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతో అమరావతి జేఏసీ నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో సమావేశం ఏర్పాటు చేసి రాజధానికి పిన్ కోడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. రాజధానిపై అభినందన సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed