- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Monalisa Bhonsle: వామ్మో ఇన్ని అకౌంట్లా..?... తెలుగు రాష్ట్రాలనూ షేక్ చేస్తున్న మోనాలిసా వీడియో..!

దిశ, వెబ్ డెస్క్: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా(Prayag Raj Maha Kumbhmela)లో మెరిసిన నాచురల్ బ్యూటీ మోనాలిసా భోంస్లే(Monalisa Bhonsle)కు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. నీలి రంగు కళ్లతో కుంభమేళాలో పూసలమ్ముతూ కనిపించిన ఆమెను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇంత అందం హీరోయిన్లకు కూడా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతలా ఆమె ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిపోయారు. దీంతో మోనాలిసాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె డీపీలతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాలో ఖాతాలు ఓపెన్ చేసి మరీ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
అయితే ఈ తేనె కళ్ల సుందరికి తెలుగు వాళ్లు కూడా మంత్రముగ్దులయ్యారు. ఏపీ, తెలంగాణలో కూడా ఆమెకు ఫ్యాన్స్ భారీగా పెరిగారు. ఈ ట్రెండీ గాళ్ పేరుతో సోషల్ మీడియాలో వందల కొద్ది అకౌంట్లను ఓపెన్ చేశారు. అంతేకాదు ఆ అకౌంట్లన్నింటిని జోడించి పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారిది సినిమాలోని మోనాలిసా చిత్రం పాటను మ్యాచ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ట్రెండీ అమ్మాయి మోనాలసాను కోహినూర్ వజ్రంతో పోల్చుతున్నారు.