Tirumala: కల్తీ నెయ్యి వివాదంపై కీలక పరిణామం.. సిట్ ఏర్పాటుపై జీవో విడుదల

by srinivas |   ( Updated:2024-09-26 17:24:22.0  )
Tirumala: కల్తీ నెయ్యి వివాదంపై కీలక పరిణామం.. సిట్ ఏర్పాటుపై జీవో విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy)పై రాష్ట్ర ప్రభుత్వం (State Government) సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ (Special Investigation Team) ఏర్పాటుపై తాజాగా జీవో విడుదల చేసింది. ఈ సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పని చేయనున్నారు. సభ్యులుగా గోపీనాథ్ జట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతరామరాజు, శినారాయణ స్వామి, సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణగా వ్యవహరించనున్నారు.

కాగా తిరుమల శ్రీవారి లడ్డూ గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం అయిందని, కల్తీ నెయ్యి వినియోగించారని నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పవిత్రంగా ఉండాల్సిన లడ్డూను కల్తీ చేయడంపై శ్రీవారి భక్తులు, హిందువులు, రాజకీయ నాయకుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లడ్డూను అపవిత్రం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీంతో లడ్డూ వివాదంపై లోతైన విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌లో సభ్యులుగా సిన్సియర్ అధికారులను నియమించింది. దీంతో లడ్డూ వివాదంపై సిట్ అధికారులు వేగంగా విచారణ చేపట్టనున్నారు. గతంలో టీటీడీలో పని చేసిన పలువురిని విచారించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed