- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేవుని కార్యక్రమంలో అపశృతి.. 150 మందికి అస్వస్థత.. కారణం ఇదే..!
దిశ ప్రతినిధి, ధర్మవరం: దేవుని కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దేవుని సన్నిధిలో ఆహరం తిని 150 మంది అస్వస్థతకు గురైయ్యారు. ఈ విషాద ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్య సాయి జిల్లా, కనగానపల్లి మండలం, కుర్లపల్లి బుడ్డా రెడ్డి పల్లిలో రామాలయంలో సీతారామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్థానికులతో పాటు బంధువులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ప్రతిష్ట కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే అన్నదాన కార్యక్రమంలో పులిహోర, పాయసం తిన్న 150 నుంచి 200 మంది అస్వస్థతకు గురయ్యారు.
విషతుల్య ఆహారం తినడంతో కళ్ళు తిరగడం, వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్న వారిని ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రులకు 108 వాహనంతో పాటు ప్రైవేట్ వాహనాల్లో తరలించారు. కాగా అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ శాతం మహిళలు చిన్నారులు కలరు.
విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు జరిగిన సంఘటన గురించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.