- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్క ఏడాది ఆగు.. వంశీ తలపొగరు అణిచివేస్తాం: Kinjarapu Atchannaidu
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఖండించారు. సైకో సీఎం అండతో రాష్ట్రంలో వైసీపీ ఆకురౌడీలు చెలరేగిపోతున్నారని ఆయన మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ మూకలు.. పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ధ్వజమెత్తారు. ఈ దాడికి సూత్రదారి వంశీనే, అతని కనుసన్నల్లోనే దాడి జరిగిందని ఆరోపించారు. వంశీ ఒక్క ఏడాది ఓపిక పట్టు నీ తల పొగరు అణిచివేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
కాగా కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ తెలుగుదేశం పార్టీగా రాజకీయం మారిపోయింది. దీంతో సోమవారం గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో వాహనాలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు నిప్పు పెట్టారు. అంతేకాదు రాళ్లతో దాడికి దిగారు. టీడీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. టీడీపీ కార్యాలయంలోని కారు అగ్నికి ఆహుతైంది. మరోవైపు మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం వంశీ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ దాడులపై టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది.
ఎమ్మెల్యే వంశీ వర్సెస్ టీడీపీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి టీడీపీ నేతలు వంశీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును సైకో అని లోకేశ్‌ను పప్పు అంటూ చేసిన వ్యా్ఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి తమ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ ను ఓడించి తీరుతామని శపథం చేశారు.
టీడీపీ కార్యాలయంపై దాడి
అయితే ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రెస్‌మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన నేతల ఇంటికి వంశీ అనుచరులు వెళ్లి వార్నింగ్‌లు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇకపై విమర్శలు చేస్తే ఊరికునేది లేదని బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు ర్యాలీగా బయలు దేరారు. ఈ సందర్భంగా వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో వంశీ అనుచరులు సైతం టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. టీడీపీ కార్యాలయంలోని ఆవరణలో పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లు కూడా రాకుండా వల్లభనేని వంశీ వర్గీయులు అడ్డుకున్నారు. పోలీసులు దగ్గరుండి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ విషయమై టీడీపీ శ్రేణులు డీఎస్పీని నిలదీశారు. విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు బైఠాయించి నిరసనకు దిగారు.