దాని వల్లే అంబానీ దేశం విడిచి వెళ్తున్నాడు.. సినీనటుడు శివాజీ

by srinivas |
shivaji
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుంపట్లు రాజ్యమేలుతున్నాయని సినీనటుడు శివాజీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుంపటి అని విమర్శించారు. కులాల కుంపటి ఇంతలా ఉంటే రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుందని సెటైర్లు వేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో సీన్లను గుర్తు పెట్టుకున్నంత ఈజీగా.. సమాజంలో జరుగుతున్న వాటిని గుర్తు పెట్టుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రజలంతా చాలా కలుషితమైపోయారన్నారు. ఈ కులాల కుంపటి.. కలుషితం నుంచి ఎప్పుడు బయటపడతామో అప్పుడే భవిష్యత్ తరాలకు మంచి జీవితాలను ఇవ్వగలుగుతామన్నారు. మరోవైపు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై ప్రశంసలు కురిపించారు. ఈ మహాపాదయాత్రకు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు శివాజీ తెలిపారు. అమరావతిని ఏదో చేద్దామనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని చెప్పుకొచ్చారు.

మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ వంటి వారు ఏం మాట్లాడినా అవేమీ చెల్లవని.. తామే శాశ్వతం అని రాజకీయ నాయకులు అనుకుంటే కుదరదని శివాజీ చెప్పుకొచ్చారు. మరోవైపు దేశంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందని విమర్శించారు. ఇది అంబానీలాంటి వారికి కూడా కష్టంగా మారిందన్నారు. అందువల్లే అంబానీ దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోవాలనుకుంటున్నారని శివాజీ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed