- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందయ్య మందు ఎలా వాడాలి, ఎవరు వాడాలి.. వివరాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ మందును ఇప్పటికే కొందరు తీసుకోగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఈ మందును ఎలా తీసుకోవాలి.? ఎవరు వాడకూడదు.? అనే విషయాలను ఆనందయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
మందు ఎలా వాడాలి..?
కరోనా రాని వారు..
– కరోనా రాని వారు ‘P’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా రెండు రోజులు తీసుకోవాలి.
– తిరిగి పది రోజుల తర్వాత ఇదే విధంగా మళ్లీ ఒక్క రోజు మందు వేసుకోవాలి.
కరోనా వచ్చిన వారు..
– ‘P’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
– ‘F’ అనే రకం మందును ఉదయాన్నే టిఫిన్‌తో పాటు గోలీ సైజులో వేసుకోవాలి. ( P రకం మందు తీసుకున్న 30 నిమిషాల తర్వాత వేసుకోవాలి.
– ఇలా F రకం మందును 2 రోజులు తీసుకోవాలి.
– ‘L’ అనే రకం మందును భోజనం ముందు గోలీ సైజులో వేసుకోవాలి. ( ‘F’ రకం మందు తీసుకున్న 3 గంటల తర్వాత ఇది వేసుకోవాలి).
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
గమనిక : కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. F,L మూడవ రోజు కూడా తీసుకోవచ్చు.
ఆక్సీజన్ లెవల్స్ తగ్గిన వారికి కంటి చుక్కల మందు..
– ‘I’ అనే రకం మందు రెండు కళ్లలో ఒక్క చుక్క చొప్పున వేసుకుని 5 నిమిషాలు వెయిట్ చేయాలి.
– ఒకవేళ కళ్లు మంటలు రాకపోతే పైన తెలిపిన విధంగా 2 సార్లు 15 నిమిషాల వ్యవధిలో వేయవలెను.
ముఖ్య గమనిక..
– మందు తీసుకున్నాక మాంసాహారం తినరాదు.
– గర్భిణీలు వాడరాదు.
– మహిళలు రుతు క్రమం సమయంలో వాడరాదు.
– మందును ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
– ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.
– రోజులో 5 లీటర్లు తక్కువ కాకుండా నీరు తీసుకోవాలి.