- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనంద్ మహీంద్ర, అనిల్ అగర్వాల్ దాతృత్వం
కరోనా విజృంభనకు సరైన సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం. అయితే కరోనాను అడ్డుకునేందుకు వెంటిలేటర్లు ఏర్పాటు చేయిస్తున్నామని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తెలపగా, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ రూ.100కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నారు.
‘‘కరోనా పై పోరడాటానికి, ప్రజలకు వెంటిలేటర్లు సమకూర్చడానికి.. మహీంద్ర గ్రూపు సత్వర చర్యలు ప్రారంభించింది. రిసోర్ట్స్‌లో తాత్కాలికంగా వెంటిలేటర్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వీటిని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, సైన్యానికి సహాయం చేయడానికి మా ప్రజెక్ట్ బృందం సిద్ధంగా ఉంది. అంతే కాకుండా మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులకు సహాయం చేస్తాము. దీని కోసం మేము స్వచ్ఛంద విరాళాలు సేకరిస్తాము. నా జీతం 100 శాతం విరాళంగా ఇస్తాను. మరో కొద్ది నెలల పాటు ఇస్తాను. మా సహ వ్యాపారులు కూడా ముందుకు రావాలని నేను అర్థిస్తున్నాను’’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. అలానే వేదాంత్ చైర్మన్ అగర్వాల్..ట్వీట్ చేస్తూ.. ‘ఈ మహమ్మారి నుంచి పోరాడేందుకు రూ.100కోట్లు ఇవ్వాలనుకుంటున్నా. దేశ్ కీ జరూరతోన్ కే లియే అనే వాగ్దానం చేస్తున్నా. మన దేశానికి ప్రస్తుతం ఇదే కావాలి. ప్రత్యేకించి రోజువారీ కూలీలకు, మన వంతు సహాయం చేద్దాం’ అని వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
Tags : ANAND MAHINDRA, CORONA VIRUS, TWEET, DONATION, BIG HEART, RESORTS, VENTILATERS , ANIL AGHARWAL